తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా పాజిటివ్!


హైదరాబాద్ జూన్ 30 తెలంగాణలో కరోనా కోరలు చాస్తోంది. సాధారణ ప్రజలు పోలీసులు అధికారులను దాటి ఎమ్మెల్యేల వరకు వచ్చింది. వరుసగా అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కరోనా బారిన పడుతుండడం కలకలం రేపుతోంది. ఇప్పటికే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి బిగాల గణేష్ బాజిరెడ్డిలు కరోనా బారినపడ్డారు. తాజాగా నిన్న తెలంగాణ హోంమంత్రి మహమూద్ అలీ కూడా కరోనాతో ఆస్పత్రిలో చేరారు. తాజాగా ఈ రోజు తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావుకు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యినట్టు సమాచారం. ఆయన కుమారుడికి కూడా వైరస్ సోకినట్టు సమాచారం. మిగతా కుటుంబ సభ్యులకు నెగెటివ్ వచ్చింది. వారంతా హోం క్వారంటైన్ లో ఉండాలని వైద్యులు సూచించారు. తెలంగాణలో ఇలా వరుసగా ఎమ్మెల్యేలు కరోనా బారిన పడడం ఆందోళన కలిగిస్తోంది. పరిస్తితి చేయిదాటిపోయేలా కనిపిస్తుండడంతోనే హైదరాబాద్ లో లాక్ డౌన్ దిశగా కేసీఆర్ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.