మనుషులపై వ్యాక్సిన్ ప్రయోగా భారత్ బయోటెకు అనుమతి భారత్ బయోటెక్ కు అనుమతి

 


న్యూ ఢిల్లీ : హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే భారత్ బయోటెక్ చేస్తున్న కరోనా వైరస్ వ్యాక్సినను జులై నుంచి మానవులపై పరీక్షించనుంది. ఇప్పటికే జంతువులపై ఈ వ్యాక్సిన్‌ను ప్రయోగించగా సురక్షితమేనని తేలడంతో పాటు సమర్థంగా పనిచేస్తున్నట్టు గుర్తించారు. ఐనీ ఎంఆర్, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సహకారంతో భారత్ బయోటెక్ కరోనా వ్యాక్సిన్ (కొవాక్సిన్'ను తయారుచేస్తున్న విషయం తెలిసిందే. రెండు దశల్లో మానవులపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు భారత్ బయోటెక్ కు డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీజీసీఏ) అనుమతులి చ్చింది. స్థానికంగా సేకరించిన వైరన్ | స్టెయిన్ ను ప్రయోగ శాల పరిస్థితులకనుగుణంగా బలహీనపరిచి, అందులో నుంచి వాక్సిన్ తయారు చేశారుఇలాంటి తొలి భారతీయ వ్యాక్సిన్ ఇదే. తాము జరిపిన ముందస్తు పరిశోధనల ఫలితాల ఆధారంగా ఇది ఎంతవరకు సురక్షితం, రోగనిరోధక ప్రతిస్పందన ఎలా ఉందనే వివరాలు సమర్పించడంతో డీజీసీఏ నుంచి తమకు అనుమతులు వచ్చాయని భారత్ బయోటెక్ తెలిపింది.