ఇంటింటికి ఆరు మొక్కలు నాటాలి : సీఎం కేసీఆర్
నర్సాపూర్ : తెలంగాణ ప్రజల వ్యక్తిత్వ పటిమ చాలా గొప్పదని, మనం తలుచుకుంటే జరగని పని లేదని సీఎం కేసీఆర్ అన్నారు. మనపూర్వికులు మనకోసం ఎంతో కష్టపడినందుకే మనం ఇవాళ ఇట్లున్నామని, మన భవిష్యత్ తరాల కోసం మనం కూడా ఎంతో కొంత చేయాలి కదా. అందుకే మళ్లీ పాత అడవులు వచ్చి తీరాలి. ప్రతి ఇంటికి ఆరు చెట్లు నాటాలని సీఎం విలుమనిచ్చారు. మెదక్ జిలా నర్సాపూర్‌లో ఆరోవిడత హరితహారం కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, నీళ్ల ట్యాంకరన్ను ఈ ప్రభుత్వం ఇచ్చిందని, నాటిన మొక్కలను బతికించుకునే బాధ్యత ఎవరికి వారు స్వచ్చందంగా తీసుకోవాలని కోరారు. తెలంగాణలో ప్రతిగ్రామంలో నర్సరీ ఉందని, దేశంలో ఏరాష్ట్రంలోనూ ఈ పరిస్థితి లేదన్నారు.
9 పోగొట్టుకున్నాం. సినిమా షూటింగుల కోసం నర్సాపూర్ అటవీప్రాంతాన్నే ఎంచుకునే వాళ్లు. గతంలో నర్సాపూర్ అడవుల్లో చాలా షూటింగులు జరిగాయి. సమష్టి కృషితోనే ఈ అటవీ ప్రాంతానికి పునరుజ్జీవం కలుగుతుంది. అడవులు కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉ ంది. నర్పంచులు, ఎంవీటీసీలు, జడ్పీటీసీలు కథానాయకులు కావాలి. ఇందులో ప్రజల సహకారం కూడా కావాలి” అని సీఎం అన్నారు. ప్రతి ఇంటికి ఆరు మొక్కలు నాటాలి. నాటిన మొక్కలకు కుటుంబ సభ్యుల పేర్లు పెట్టాలి. మొక్క ఎండిపోతే బిడ్డ ఎండిపోయినట్లు అని సెంటిమెంట్ క్రియేట్ చేయాలని చెప్పారు.