న్యూఢిల్లీ, జూన్ 19: భారత్ చైనా నరిహద్దు లో చైనా ఆగడాలు మితిమీరుతున్నాయి. తాజాగా గ్యాల్వన్ వ్యాలీలో భారత సైన్యం 20 మంది మృతి చెందిన నేపథ్యంలో నేడు ప్రధాని నరేంద్ర మోడీ సాయంత్రం ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ చైనా విషయంలో సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. రెచ్చగొడితే ఊరుకునేది లేదంటూ తేల్చి చెప్పారు.
సరైన సమయంలో మన సత్తా, శక్తిసామర్థ్యాలు చాటి చెబుదామని, మన హక్కులు కాపాడుకునే విషయంలో రాజీ ఇక పడేది లేదని ఆయన పేర్కొన్నారు. ఇక తాము శాంతిని కోరుకుంటు న్నామని, అలా కాదంటే ధీటుగానే బదులు ఇస్తామంటూ పేర్కొన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ సమావేశంలో దేశంలోని అన్ని పార్టీల అధ్యక్షులను లను పాల్గొనమని ఆహ్వానించారు. సాయంత్రం ఐదు గంటలకు నిర్వహించనున్న ఈ అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీల అభిప్రాయాలు తీసుకుని, చైనా అఖం అంశంలో భవిష్యత్ కార్యాచరణ రూపొందించాలని భావిస్తున్నారు ప్రధాని నరేంద్రమోడీ. ఒక పక్క దేశం కరోనాతో సతమ తమౌతున్నవేళ, నిన్న మొన్నటి వరకు పాకిస్థాన్ తో నెలకొన్న వివాదం, ఇ ఇక తాజాగా చైనాతో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు, భారత దేశ ఆర్థిక స్థితిగతులు, భారత దేశ రక్షణ వ్యవస్థ సామర్ధ్యం విటన్నింటిని విరజు వేసుకుని సామర్థ్యం వీటన్నింటిని బేరీజు వేసుకుని పార్టీల అభిప్రాయాలను తీసుకుని నిర్ణయం తీసుకోవాలని ప్రధాని నరేంద్ర మోడీ భావించటం వెనుక ఒక మంచి ఆంతర్యం ఉందని బిజెవీ శ్రేణులు చెబుతున్నాయి. దేశం యొక్క తాజా పరిస్థితి అందరికీ విదితమే. చైనాతో యుద్ధం చేయడం అంటే, పాకిస్తాన్ పై సర్జికల్ స్ట్రైక్ చేసినంత ఈజీ కాదు. 20 మంది సైనికులు మృతి చెందిన ఈ సమయంలో తీవ్రమైన వేదన ఉ న్నప్పటికీ, న్నప్పటికీ, సంయమనం కోల్పోయి దేశానికి కలిగే లాభ నషాలను బేరీజు వేయకుండా ముందుకు వెళ్లడం మంచిదికాదు అని ప్రధాని నరేంద్ర మోడీ ఉ ద్దేశం. ఇక మరో పక్క చైనా విషయంలో మోడీ సైలెంట్ గా ఎందుకు ఉ ంటున్నారు అని, రోజుకో రకమైన విమర్శలు , అనుమానాలు ప్రతిపక్ష పార్టీలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఇక ఈ సమయంలో అఖిలపక్ష భేటీ ద్వారా అందరితో మాట్లాడి వారి అభిప్రాయాల మేరకు నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశం ఉ ండదని ప్రధాని మోడీ భావిస్తున్నారు.