న్యూఢిల్లీ: దాదాపు గత ఐదు దశాబ్దాలుగా చైనా-భారత సరిహద్దులోని సైనికుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది. లద్దాలోని గాల్వన్ లోయలో గత ఆరు వారాలుగా కొనసాగుతున్న ఉద్రిక్త వాతావరణం సోమవారం రాత్రి తీవ్రమై.. భారతదేశం తన 20 మంది. సెనికులును ఆలో కోల్పోయింది. చైనా వైపున 40 మందికి - పైగా ప్రాణనష్టం జరిగినట్లు వార్తలు ఈ వెలువడుతున్నాయి. ఈ నెత్తుటి ఘర్షణ భారత్-చెనా మద్య కొనసాగుతున్న ఉ ద్రిక్తతను మరింత పెంపొందించేదిగా తయారైంది. కమాండింగ్ ఆఫీసర్ సహా 20 మంది భారతీయ సైనికులు మతిచెందిన ఈ హింసాత్మక ఘరణ గురించి విదేశీ మీడియా సైతం స్పందించాయి. పరిస్థితులు దిగజారితే పరిణామాలు ఎలా ఉంటాయో అని , విశ్లేషణలు రాశాయి.
చైనా వైపు నుంచి మొదలున్యూయార్క్ టైమ్స్
భారత్-చైనా మధ్య మరణపై న్యూయార్క్ టైమ్స్ మొదటి పేజీలో బాటమ్ లైన్ వార్తగా ప్రచురించిందిఇటీవల తమ మిలిట్రీకి చెందిన వాహనాలు, ఎక్సకవేటర్లు, ఆయుధ సామతోపాటు సైనికులను చైనా.భారత్ సరిహద్దు వెంట మోహరించిందిచైనా తీసుకొన్ని ఈ నిర్ణయంతో గత ఐదు దశాబ్దాలుగా నెలకొన్న ఉదికతను చైని మరింత పెంచి పోషించినట్లయిందిఅనంతరం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్భారత ప్రధాని మోదీ కొన్ని దృఢమైన నిర్ణయాలు తీసుకొన్నారు. దీంతో పరిస్థితులు చేయిదాటిపోయే ప్రమాదం పొంచి ఉన్నదని న్యూయార్క్ టైమ్స్ తన వార్తలో పేర్కొన్నది. .
చర్యలు కొనసాగించలేకపోయారువాషింగ్టన్ పోస్ట్
భారత్-చైనా మధ్య సరిహద్దు ఘర్వణను పతాక శీర్షికన వాషింగ్టన్ పోస్ ప్రచురించింది. 1962 లో జరిగిన యుద్ధం మినహాయిస్తే ఇరు దేశాల మధ్య తలెత్తుతున్న వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకొనే అవకాశాలు ఉన్నాయి. అయితే గత కొంత కాలంగా చర్చలు నిలిచిపోవడంతో ఆ ప్రతిష్టంభన ఘర్షణ వాతావరణానికి దారితీసింది. ఫలితంగా అనేక మంది గాయపడాల్సిన దుస్థితులు నెలకొన్నాయంటూ వాషింగ్టన్ పోస్ట్ విశ్లేషించింది.
40 ఏండ్లలో తూటా పేలలేదు కానీ.. : బీబీసీ
ఇండియా-చైనా క్లాష్: యాన్ ఎక్స్ ట్రార్డినరీ ఎస్కలేషన్ విత్ రాక్స్ అండ్ క్లబ్స్ శీర్షికతో బీబీసీ వార్తాకథనాన్ని ప్రచురించింది. ఈ కథనంలో గత 40 ఏండ్లుగా ఇరు దేశాల మధ్య కనీసం ఒక్క తూటా కూడా పేలలేదని, అయితే ఇరువైపుల నుంచి పెద్ద సంఖ్యలో సైనికుల మరణాలు జరుగడం ఆశ్చర్యంగా ఉన్నదని పేర్కొన్నది. ఇరు దేశాలు ఎల్వసీ వెంట గస్తీ కాస్తూ పలు ప్రాంతాల్లో ఒకరి భూభాగంలోకి మరొకరు వెళ్లారు. దీంతో అనేకసార్లు ఘర్షణలు కూడా జరిగిన ఇంతటి ప్రాణ నష్టం జరుగడం ఇదే మొదటిసారనిఅందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నది అంటూ వార్త రాసింది.
విస్తరణ కాంక్షతోనే ఘర్పణలు: ది గార్డియన్
హిమాలయన్ ఫ్లాష్ పాయింట్ కుడ్ స్పెరల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అని స్పాట్ లైట్ కింద భారత-చైనా ఘర్పణ వార్తను ది గార్డియన్ ప్రచురించిందిసరిహద్దు ఘర్పణలో భారత్ కు చెందిన 20 మంది సైనికులు మృతిచెందారని వార్త కథనం ప్రారంభించిన ది గార్డి యన్.. దేశ సరిహద్దులను విస్తరించు కోవాలన్న కాంక్ష ఎక్కువవడం వల్లనే ఇలాంటి ఘర్షణలకు దారి తీస్తుందని స్పష్టంచేసింది. అణ్వాయుధ దేశాలైన భారత్-చైనా సైనిక దళాలు కర్రలు, రాడ్లతో దాడులకు దిగి కొట్టుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది కచ్చితంగా విస్తరణ కాంక్షనే. దీని వల్ల తలెత్తనున్న ప్రమాదాన్ని ఈ ఘర్షణలు ఎత్తిచూపు తున్నాయి అంటూ చైనాకు చురకలు అంటించింది. 1975 తర్వాత జరిగిన మొదటి ఘోరమైన ఘర్షణ అని, 1967 తర్వత జరిగిన అత్యంత ఘోరమైనదిగా ది గార్డియన్ చిత్రీకరించింది.