వరంగల్ జూన్ 15 : విద్యుత్ చార్జీల మాఫీపై జిల్లాలోని ఎంపీడీసీఎల్ ముందు నిరసన వ్యక్తం చేస్తున్న బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ వివేకన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన్ను సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే... ఆదుకోవాల్సిన ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. అదనపు విద్యుత్ చార్జీల పేరుతో రూ.800 కోట్ల భారం మోపుతోందన్నారు. వారం రోజులుగా పోరాటం చేస్తున్నా సర్కార్ పట్టించుకోవడం లేదని విర్మించారు. విద్యుత్ బిల్లులు మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రూ.300 వచ్చే వాళ్లకు రూ.3 వేలు బిల్లు వేశారని ఆరోపించారు. ప్రజలు ఇబ్బందిలో ఉన్నప్పుడు ప్రజలకు ప్రభుత్వం మేలు చేయాలని ఆలోచించాలి కానీ ప్రజలపై భారం మోపేలా కాదని హితవు పలికారు. ఎక్కువ బిల్లులు వేయడం, వడ్డీతో కట్టమనడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి నిజాం సర్కార్ వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీస్ కల్వకుంట్ల స్వవకు అన్నట్లుగా మార్చారన్నారు. సీఎంకు ప్రజలు తగిన గుణపాఠం చెబురని మాజీ ఎంపీ వివేక్ హెచ్చరించారు.
వరంగల్‌లో మాజీ ఎంపీ వివేక్ అరెస్ట్