హైదరాబాద్: శంషాబాద్ ఓఆర్‌ఆర్‌పై ప్రముఖ నటుడు రాజశేఖర్ కారుకు ప్రమాదం జరిగింది. పెద్ద గోల్కొండ దగ్గర అదుపు తప్పి కారు బోల్తా పడింది. రాజశేఖర్ కారు మూడు పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో రాజశేఖర్‌తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి. అయితే వెంటనే కారులోని బెలూన్లు తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. రామోజీ ఫిలిం సిటీ నుంచి ఇంటికి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
పల్టీలు కొట్టిన హీరో రాజశేఖర్ కారు..