విజయవాడలో దారుణ హత్యకు గురైన బాలిక మొవ్వ ద్వారక హత్య కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. చిన్నారి హత్య కేసులో కొత్తకోణం వెలుగులోకి వచ్చింది. ద్వారక హత్యకు వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిందితుడు ప్రకాశ్‌తో పాటు బాలిక తల్లిని కూడా పోలీసులు విచారిస్తున్నారు. వారిద్దరి మధ్య ఫోన్‌లో సాగిన సంభాషనే విచారణలో కీలకం కానుంది. బాలిక తల్లికి ప్రకాశ్‌కు గతకొంత కాలంగా వివాహేతర సంబంధం ఉందని, అదే ద్వారక హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బాలిక తల్లికి అతను చాలా సార్లు ఫోన్ కాల్స్ చేసినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఇద్దరినీ అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఫోన్ కాల్స్‌పై ఆరా తీస్తున్నారు. కాగా చిన్నారి ద్వారకను తానే హత్య చేసినట్లు నిందితుడు ప్రకాశ్ ఇదివరకే అంగీకరించిన విషయం తెలిసిందే.