పందెం కట్టి.. 41 గుడ్లు తిని.. ప్రాణాలు వదిలాడు!


జౌన్‌పూర్‌: ఇద్దరు స్నేహితుల మధ్య సరదా పందెం ఒకరి ప్రాణాలను తీసింది. యూపీలోని జౌన్‌పూర్‌ జిల్లాకు చెందిన సుభాష్‌ యాదవ్‌(42) అతని మిత్రుడు ఉడకబెట్టిన గుడ్లు తిందామని బయటికి వెళ్లారు. ఎవరు ఎక్కువ గుడ్లు తింటారన్న దానిపై చర్చ వచ్చింది. సుభాష్‌ 50 గుడ్లు తింటానన్నాడు. అలాగైతే రూ.2 వేలు ఇస్తానని అతడు మిత్రుడు పందెం వేశాడు. సుభాష్‌ 41 గుడ్లు తిన్నాడు. 42వది తింటుండగానే స్పృహ తప్పి పడిపోయాడు. ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయాడు.