టి.ఎస్ ఆర్టిసి బంద్ విజయవంతం

హైదరాబాద్ అక్టోబర్ 19 ఆర్టీసీ కార్మికులు 15 రోజులుగా చేస్తున్న నమ్మెకు మద్దతుగా ఈ రోజు తెలంగాణలో రాష్ట్ర వ్యాప్త బంద్ సంపూర్ణంగా ముగిసింది. ప్రతిపక్ష పార్టీలు, వామపక్షాలు, ప్రజా సంఘాలు, ద్యార్థి సంఘాలు, ఉద్యోగ సంఘాలు బండ్లో పాల్గొంటున్నాయి. బండ్లో భాగంగా ఆందోళనలు, నిరనన కార్యక్రమాలు చేపడుతున్నారు. బంద్ను విజయవంతం చేసి ప్రభుత్వం దిగొచ్చేలా చేయాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాయి. మరోవైపు బంద్ ప్రభావం లేకుండా చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.



టైర్లకు మేకులు కొట్టే యత్నం


హైదరాబాద్ నాగోల్ బండ్లగూడ డిపో వద్ద బస్సు డీజిల్ ట్యాంకర్ను ఆందోళనకారులు అడ్డుకోవడంతో ఉ ద్రికత పరిస్థితులు తలెత్తాయి. డీజిల్ ట్యాంకర్ టైర్లకు మేకులు కొట్టేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఓ ప్రైవేటు డ్రైవర్ను కూడా ఆర్టీసీ కార్మికులు చితకబాదారు. ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఆందోళన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంజీబీఎస్ దగ్గర కూడా పెద్ద ఎత్తున ఆందోళన, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బస్సులను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


బస్సుపై రాళ్ల దాడి


నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం దాస్ నగర్ వద్ద ఆర్టీసీ బస్సుపై రాళ్లతో ఆందోళనకారులు దాడి చేయడంతో బస్సు అద్దాలు ధ్వంసమ య్యాయి. నిజామాబాద్ నుంచి వరంగల్ వెళ్తున్న ఈ బస్సును బందోబస్తు మధ్య ఆర్మూర్ పోలీసులు దాటించారు. బంద్ నేపథ్యంలో ఆర్మూర్లో డిపోకే బస్సులు పరిమితయ్యాయి. ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో అయినవి. ఆశ్రిత ఎల్ సందర్భంగా ఎస్పీ చేతుల మీదుగా ఎంజీవోల ప్రవళిక, పి.తరుణ్, ఏం అభిలాష్ లకు బహుమతి ప్రదానోత్సవం ఉంటుంది. జన్మదిన తహసీలాగ్ బంద్ ప్రశాంతంగా జరుగుతోంది. ప్రయాణికులు లేక బస్టాండ్లు నిర్మానుష్యంగా మారాయి. పరకాలలో అరెస్ల పర్వంవరంగల్ రూరల్ జిల్లా పరకాల పట్టణంలో ఆర్టీసీ కార్మికులు తల పెట్టిన బంద్ సంపూర్ణంగా కొనసాగుతోంది. బంద్కు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు పలకడంతో వ్యాపార వాణి జ్య విద్యా సంస్థలు బండ్లో స్వచ్చందంగా పాల్గొంటున్నాయి. పరకాల పట్టణం నిర్మానుష్యంగా మారింది. ప్రయాణికులు లేక పరకాల బస్టాండ్ వెలవెలబోతోంది. తాత్కాలిక డ్రైవర్లు కండక్టర్లు విధులకు హాజరు రాకపోవడంతో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. డిపో ప్రాంగణంలో భారీగా పోలీసులను మోహరించారు. పరకాల ఆర్టీసీ జేఏసీకి చెందిన 20 మంది కార్మికులను పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఉ దయం 5 గంటల నుండే ఇండ్లలోకి పోయి కార్మికులను పోలీనులు అదుపులోకి తీసుకున్నారు.



 ఆర్టీసీ కార్మికులకు మద్దతుగా సికింద్రబాద్ జూబ్లీ బస్టాండ్ వద్ద బంగ్లో పాల్గొనేందుకు వచ్చిన తెలంగాణ జన నమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్, పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని బొల్లారం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆర్టీసీ కార్మికులతో వెంటనే ప్రభుత్వం చర్చలు జరపాలని ఈ సందర్భంగా కోదం డరామ్ డిమాండ్ చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే మోత్కుపల్లి నర్సింహులను పోలీసులు అరెస్ట్ చేశారు తెలంగాణ రాష్ట్ర బంద్ నేపథ్యంలో జూబ్లీ బస్టేషన్ లో టీటీడీపీ ప్రెసిడెంట్ ఎల్ రమణ, ఆ పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖరరెడ్డి, అలాగే ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.