నిద్ది పేట బ్యూరో ప్రజాసాక్షిఅక్టోబర్ 21:
హుస్నాబాద్ పట్టణంలోని కోత్త చెరువు కింద ఉన్న రైతుల పోలాలను సోమవారం నాడు బిజెపి నాయకులు పరిశీలించారు. గత 4, 5 రోజులుగా వర్షం కురుస్తున్నప్పటికి,నిన్న కురిసిన వర్షానికి వరి,మొక్కజొన్న పంటలు నీటి మునిగి, భూమికి ఒరిగాయి,వరి చేను రంగు మారి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షాల వల్ల రైతులు ఆరుకాలం పండించిన పంట,కోతకు వచ్చే వేళ త్రీవ నష్టం వాటిల్లింది. ఈ సమస్యపై స్థానిక ఏఓకు ఫోన్ ద్వారా వర్షాల వల్ల నష్టపోయిన రైతులను గుర్తించి కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ భీమా యోజన ద్వారా రైతులకు నష్ట పరిహారం అందించేలే చర్యలు తీసుకోవాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా నష్టపోయిన రైతులకు వెంటనే నష్ట పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రైతుల పక్షాన పెద్దెతున్న ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తుమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ బిజెపి పట్టణ, మండల అధ్యక్షులు గుత్తికోండ విద్యాసాగర్, వేముల ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు బురుగు సదానందం గౌడ్,ప్రధాన కార్యదర్శి వెల్దండి సంతోష్, బిజేవైయం జిల్లా అధికార ప్రతినిధి బత్తుల శంకర్ బాబు, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి వరియోగుల అనంత స్వామి, బిజేవైయం జిల్లా నాయకులు కర్ణకంటి నరేష్, బిజెపి నాయకులు పోలోజు రవి,రాజేశం,రవి తదితరులు పాల్గొన్నారు.