రుణాల మంజూరులో స్తబ్దత

ముంబయి : దేశ ఆర్ధిక వరిస్తితి బలహీనంగా ఉండటంతో బ్యాంకుల్లో కనీసం అప్పులు తీసుకునే వారు కూడా కరువయ్యారు. డిమాండ్ లేకపోవడంతో గడిచిన ఏప్రిల్ నుంచి ఆగస్టు కాలంలో రుణాల జారీ రూ.90వేల కోట్లకు పడిపోయిందని స్వయంగా రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా గణంకాలు వెల్లడిస్తున్నాయి. నోట్ల రద్దు, జిఎసి అమలు లాంటి కీలక నిర్ణయాల వల్ల దేశ ఆర్ధిక మాత్రమే వ్యవస్థలో స్తబ్దత చోటు చేసుకోవడంతో ప్రజల కొనుగోలు శక్తి పడిపోయిందని ఇప్పటికే పలు రిపోర్టులు పేర్కొన్నాయి. అమ్మకాలు లేకపోవడంతో చాలా పరిశ్రమ రంగాలు కొత్త పెట్టుబడులపై దృష్టి పెట్టడం లేదు. ఈ పరిణామాలు దేశంలో రుణాల జారీపై ప్రతికూలతను చూపుతున్నాయి. 2019 ఏప్రిల్ నుంచి ఆగస్టు కాలంలో రుణాల జారీ రూ.91,030 కోట్లకు పడిపోయింది. గతేడాది ఇదే కాలంలో ఏకంగా రూ.1.5 లక్షల కోట్ల రుణాల జారీ చోటు చేసుకుంది.



ఈ పరిణామం రెండు అంశాలను సూచిస్తోంది. దేశంలో పెట్టుబడులు పడిపోవడంతో కంపెనీలు కొత్త ఆప్పులను తీసుకోవడానికి ఆసక్తి చూపడం లేదని కేర్ రేటింగ్స్ చీఫ్ ఎకనామిస్టు మదన్ సబ్నవిస్ అన్నారు. రెండోది బ్యాంకులు పరిశ్రమలకు అప్పులివ్వడానికి భయపడుతున్నాయన్నారు. రిటైల్ రుణాలకు ప్రాధాన్యతనిస్తున్నాయని పేర్కొన్నారు. స్థూలంగా వృద్ధి బలహీనతను సూచిస్తుందన్నారు. గత పది సంవత్సరాల్లో అసాధారణంగా రుణాల జారీ పడిపోవడం రెండో సారి అని నిపుణులు పేర్కొంటున్నారు. 2017 ఏప్రిల్-ఆగస్టులోనూ రూ.92,700 కోట్ల ందని అమ్పులు మాత్రమే ఇచ్చాయి. 2016 నవంబర్‌లో పెద్ద నోట్ల రద్దు దెబ్బతో ఆ కాలంలో రుణాల జారీలో స్తబ్దత చోటు చేసుకుంది. తాజాగా మళ్లీ గడిచిన ఆగస్టు కాలంలో ఈ పరిస్థితి నెలకొంది. గడిచిన మార్చి తర్వాత సీజన్ బలహీనంగానే ఉందని, పండగ సీజన్ నేపథ్యంలో సెప్టెంబర్ తర్వాత మళ్లీ పెరుగొచ్చని ఎపి జైన్ ఇన్‌స్ట్యూట్ ఆఫ్ మేనేజ్ మెంట్ స్టడీస్ ఆసిస్టెంట్ ప్రొఫెసర్ అనంత్ నారాయన్ పేర్కొన్నారు. గతేడాది సెప్టెంబర్ లో మౌలిక వసతుల కంపెనీ ఐఎల్ అండ్ ఎస్ఎస్ సంక్షోభం తర్వాత రుణాల మంజూరు పడిపోయింది. ఏడాదికేడాదితో పోల్చి తే శాతం, విలువ పరంగా వాస్తవంగా తగ్గాయి. రుణాల జారీ వృద్ధి 13.4 శాతం నుంచి 10.2 శాతానికి తగ్గిపోయింది. సాధారణ ఆర్ధిక వ్యవస్థ మందగింపు, బ్యాంకుల అప్రమత్తత వల్ల ఈ పరిస్థితి చోటు చేసుకుందని నారాయన్ పేర్కొన్నారు. ఇటీవల కార్పొరేట్లపై పన్నును తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఉద్దీపనలు ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవ డానికి, రుణాల డిమాండ్ పెరగడానికి అవకాశం ఉ ందని నారాయన్ పేర్కొన్నారు. వచ్చే రెండుమూడు నెలలు ఆసక్తిగా, క్లిష్టంగా ఉండొచ్చ న్నారు. రుణాల మంజూరు పెరుగు తుందో లేదో వేచి చూడాలన్నారు. కార్పొరేట్ పన్ను తగ్గించడం, రుణ మేళలు బ్యాంకింగ్ దీపావళిని ఇవ్వొచ్చని అభిప్రాయపడ్డారు.


కొన్ని వాణి జ్య బ్యాంకులను మూసివేస్తున్నట్లు వస్తున్న వార్తలను రిజర్వు బ్యాంకు ఖండించింది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని బుధవారం పేర్కొంది. అవన్నీ తప్పుడు వార్తలంటూ ఆర్‌బిఐ తన ట్వీట్ లో తెలిపింది. కొన్ని బ్యాంకులను మూసివేస్తున్నట్లు వస్తున్న ఊహాగానాల్లో నిజం లేదని కూడా ఫైనాన్స్ సెక్రటరీ రాజీవ్ కుమార్ తెలిపారు. పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను మూసిఎ ?యడం లేదన్నా రు. ఖాతాదా రులకు ఉ త్తమమైన సేవలను అందించేందుకు ప్రభుత్వమే పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను బలోపేతం చేస్తుందని రాజీవ్ తెలిపారు.